ఆదాయపన్ను శాఖ(Income Tax Department) భారీస్థాయిలో విరుచుకుపడుతున్నది. హైదరాబాద్, చెన్నైల్లో పెద్దసంఖ్యలో బృందాలు(Teams) దాడుల్లో పాల్గొంటున్నాయి. హైదరాబాద్ లోని పలు చిట్ ఫండ్స్ కంపెనీల్లో డాక్యుమెంట్స్ ని అధికారులు పరిశీలిస్తున్నారు. ఇంచుమించు 100 టీమ్ లతో కూడిన అధికారులు.. అనుమానం వచ్చిన వ్యాపారుల ఇల్లు, ఆఫీసులపై దాడులు చేస్తున్నారు. కూకట్ పల్లి, అమీర్ పేట, జూబ్లీహిల్స్, శంషాబాద్ ప్రాంతాల్లో ఈ రోజు తెల్లవారుజాము నుంచే రెయిడ్స్ నడుస్తున్నాయి. కూకట్ పల్లిలోని హిందూ ఫార్చ్యూన్ లో పెద్దయెత్తున ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అమీర్ పేటలోని పూజాకృష్ణ చిట్ ఫండ్ ఓనర్ ఇల్లు, ఆఫీసులో డాక్యుమెంట్స్ పరిశీలిస్తున్నారు. ఈ రెండు చోట్లనే 40 మంది అధికారులు సోదాల్లో పాల్గొంటున్నారు. డాక్యుమెంట్స్ తోపాటు బ్యాంక్ అకౌంట్స్, ల్యాప్ ట్యాప్స్, కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నారు.
తమిళనాడులోనూ భారీగా
తమిళనాడులోనూ IT సోదాలు నడుస్తుండగా.. DMK ఎంపీ జగత్ రక్షకన్ ఇంట్లో అధికారులు పరిశీలన జరుపుతున్నారు. తమిళనాడు వ్యాప్తంగా మొత్తం 40 ఏరియాల్లో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు.