భారత్ లో అత్యధిక భూములన్నది వక్ఫ్ బోర్డుకేనని అందరూ బలంగా నమ్ముతారు. కానీ వక్ఫ్ బోర్డు కన్నా మిన్నగా భూములన్నది క్యాథలిక్(Catholic) చర్చికే. కేంద్ర ప్రభుత్వం తర్వాత అతిపెద్ద భూ యజమాని(Land Owner) క్యాథలిక్ చర్చే. 2021 ఫిబ్రవరి నాటికి సర్కారు లెక్కల ప్రకారం భారత ప్రభుత్వం ఆధీనంలో 15,531 చదరపు కిలోమీటర్ల మేర భూమి ఉంది. 51 శాఖలు, 116 ప్రభుత్వ రంగ సంస్థల పరిధిలో ఈ భూమి ఉంది.
ఆ తర్వాతి ప్లేస్ లో 7 కోట్ల హెక్టార్ల(17.29 కోట్ల ఎకరాల)తో క్యాథలిక్ చర్చి రెండో స్థానంలో నిలిచింది. చర్చిలు, ఛారిటబుల్ ట్రస్టుల్లోని మొత్తం భూమి విలువ రూ.20 వేల కోట్లకు పైమాటే. 1947కు పూర్వమే బ్రిటిష్ ప్రభుత్వం నుంచి ఈ సంస్థకు భారీగా భూములు బదిలీ కాగా.. 1927లోనే ‘చర్చి యాక్ట్’ అమల్లోకి వచ్చింది. గోవా, కోహిమా సహా దేశవ్యాప్తంగా 7,319 ప్రైమరీ, 3,765 హైస్కూళ్లు, 3,187 నర్సరీ స్కూళ్లు, 2,457 హాస్పిటళ్లు, 240 మెడికల్ కాలేజీలు చర్చి ఆధీనంలో ఉన్నాయి.