దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. శనివారం నాటితో పోల్చితే 10 గ్రాముల బంగారం(gold) రేట్ సోమవారం రూ.151 తగ్గి రూ.61,114కు చేరుకుంది. అటు వెండి(silver) రేట్ లో కొంచెం తగ్గుదల కనిపించింది. కిలోకు రూ.205 తగ్గుముఖం పట్టి ప్రస్తుతం రూ.77,360 పలుకుతోంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ప్రొద్దుటూరు నగరాల్లో ఇవే రకమైన ధరలు కొనసాగుతున్నాయి.