బ్యాంకు ఖాతాలో కనీస బ్యాలెన్స్ ఉంటే చాలు. కానీ దేశంలోనే రెండో అతిపెద్ద(Second Largest) బ్యాంక్ ICICIలో ఇక నుంచి రూ.50 వేలు ఉండాల్సిందే. ఈ ఆగస్టు 1 నుంచే ఇది అమల్లోకి వచ్చింది. అకౌంట్ తీసే కస్టమర్లు నగరాలు, పట్టణాల్లో రూ.50 వేలు.. సెమీ-అర్బన్, గ్రామాల్లో రూ.25 వేలు ఉంచితేనే పెనాల్టీలు తప్పించుకుంటారు. ఇప్పటిదాకా అది పట్టణాల్లో రూ.10 వేలు.. రూరల్ లో రూ.5 వేలుగా ఉంది. తగ్గిన మినిమం బ్యాలెన్స్ ను బట్టి 6 శాతం లేదా రూ.500 పెనాల్టీ చెల్లించాల్సి వస్తుంది. ఇక క్యాష్ డిపాజిట్లు 3 సార్లు ఉచితం కాగా.. తర్వాతి డిపాజిట్ కు రూ.150 చొప్పున ఛార్జ్ చేస్తారు. ఫ్రీ విత్ డ్రాలు సైతం నెలకు 3 సార్లు మాత్రమే.