ఇప్పటికే హైదరాబాద్ లో దిగ్విజయంగా సాగుతున్న మెట్రో మరింత విస్తరించనుంది. పాతబస్తీలో పనుల్ని ప్రారంభించాలని CM కేసీఆర్ ఆదేశించారు. MGBS-ఫలక్ నుమా దారిలో 5.5 కిలోమీటర్ల మెట్రో రైలు నిర్మాణ పనులు స్టార్ట్ చేయాలంటూ మున్సిపల్ డిపార్ట్ మెంట్ తోపాటు, ఎల్ అండ్ టీకి సూచించారు. మెట్రో రైలు తొలి విడత కింద 69.5 కిలోమీటర్లు నిర్మించిన ఎల్ అండ్ టీ… పలువురి అబ్జెక్షన్స్ దృష్ట్యా పాతబస్తీ విషయంలో చేతులెత్తేసింది.
ఈ MGBS-ఫలక్ నుమా కంప్లీట్ అయితే మెట్రో మార్గం 74.7 కిలోమీటర్లకు విస్తరిస్తుంది. సుమారు ఏడు సంవత్సరాలుగా MGBS-ఫలక్ నుమా ప్లాన్ నిలిచిపోయింది. పనులు వెంటనే స్టార్ట్ చేయాలంటూ కేసీఆర్ ఆదేశించారని మంత్రి KTR ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఈ మార్గంలో పెద్దయెత్తున ప్రార్థనా స్థలాలు తొలగించాల్సి రావడంతో MIM అభ్యంతరం తెలిపింది. మెట్రో కారిడార్ గా జూబ్లీ బస్ స్టేషన్ నుంచి ఫలక్ నుమా వరకు 16 కిలోమీటర్ల మార్గం నిర్మించాల్సి ఉంది.
Lakdi ka pul Mehdipatnam Gachibowli varaku Kuda veste chala useful ga untadi