గుజరాత్ లో భారీస్థాయిలో పెట్టుబడులు పెట్టేందుకు అమెరికన్ కంపెనీ ముందుకొచ్చింది. అమెరికన్ కంప్యూటర్ స్టోరేజ్ చిప్ మేకర్ అయిన మైక్రాన్ టెక్నాలజీ కంపెనీ… చిప్ ల తయారీ యూనిట్ ను పెట్టేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించి ఆ సంస్థ రిప్రెజెంటేటివ్స్ తో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సమక్షంలో ఒప్పందం మీద సంతకాలు పూర్తయ్యాయి.
అహ్మదాబాద్ జిల్లాలోని సనంద్ లో అసెంబుల్డ్ సెమీకండక్టర్ల తయారీ యూనిట్ ను నెలకొల్పుతారు. ఈ ప్లాంటు కోసం 2.75 బిలియన్ డాలర్లు(రూ.22,540 కోట్లు) పెట్టుబడి పెడుతున్నట్లు మైక్రాన్ టెక్నాలజీ ప్రకటించింది. ఇంత పెద్ద కంపెనీ రాష్ట్రానికి రావడం పట్ల సీఎం భూపేంద్ర పటేల్ ఆనందం వ్యక్తం చేశారు.