
దేశంలో MLAల ఆస్తుల విలువ రూ.55,545 కోట్లు అని రెండు సంస్థల జాయింట్ రిపోర్ట్ ద్వారా వెల్లడైంది. ‘అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ADR)’, ‘నేషనల్ ఎలక్షన్ వాచ్(NEW)’ జరిపిన సర్వేలో ఇవి వెలుగుచూశాయి. 28 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో 4001 మంది MLAల డీటెయిల్స్ ను ఆ సంస్థలు సేకరించాయి. వారి అఫిడవిట్ల నుంచి సేకరించిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఈ రిపోర్ట్ తయారు చేసినట్లు తెలిపాయి. ఇందులో BJP(1,356 మంది) రూ.16,234 కోట్లతో ఫస్ట్ ప్లేస్ లోఉండగా… కాంగ్రెస్(719) రూ.15,798 కోట్లతో రెండో స్థానంలో నిలిచింది. YCP(146) రూ.3,379 కోట్లు, DMK(131) రూ.1,663 కోట్లు, AAP(161) రూ.1,642 కోట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

శాసనసభ్యుల్లో సగానికి పైగా ఆస్తులు రెండు ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ వే నని రిపోర్టులో పేర్కొంది. దేశంలోని MLAల ఆస్తుల విలువ మూడు ఈశాన్య రాష్ట్రాల(మిజోరాం, సిక్కిం, నాగాలాండ్) బడ్జెట్ కన్నా ఎక్కువని వెల్లడించింది. వీరి ఆస్తుల్లో టాప్ ప్లేస్ లో నిలిచిన రాష్ట్రం కర్ణాటక. అక్కడ 223 మంది శాసనసభ్యులకు రూ.14,359 కోట్ల ఆస్తులున్నాయని, తర్వాతి స్థానంలో మహారాష్ట్రలో 284 మందికి 6,679 కోట్లు, థర్డ్ ప్లేస్ ఆక్రమించిన ఆంధ్రప్రదేశ్ లో 174 మందికి రూ.4,914 కోట్ల ఆస్తులున్నట్లు ADR, NEW రిపోర్టు తెలియజేసింది.