ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన విధానాలతో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుంటే… భారతీయులు మాత్రం మోదీ వైపే చూస్తుంటారు. ఆయన గురించి తెలుసుకోవాలని ఉబలాటపడుతుంటారు. అలాంటి ఆసక్తికర వివరాలు స్వయంగా ఆయన వెల్లడించినవి బయటకు వచ్చాయి. ఆయన మొత్తం ఆస్తి విలువ రూ.2.58 కోట్లుగా కేంద్రం ప్రకటించింది. 2022-23 ఫైనాన్షియల్ ఇయర్ కు సంబంధించి ఆయన సమర్పించిన లెక్కల ద్వారా ఆదాయం, అప్పులు వెల్లడయ్యాయి. గతేడాది రూ.2,23,82,504 ఉండగా.. ఈ సంవత్సరం మరో రూ.35 లక్షలు(15.69%) పెరిగి రూ.2.58 కోట్లకు చేరుకుంది. ఆయన పేరు మీద కొంత క్యాష్, బ్యాంకులో ఫిక్స్ డ్ డిపాజిట్లు, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లు, 4 బంగారు ఉంగరాలు తప్పితే ఇతర స్థిర, చరాస్తులు లేవు. మోదీ ఆస్తుల్లో 95.55 శాతం గుజరాత్ గాంధీనగర్ లోని SBI బ్రాంచిలో ఉన్నాయి. SBI NSC బ్రాంచిలో FDR, MOD రూపంలో ఆస్తులున్నాయి. డిపాజిట్లు, పోస్టల్ సేవింగ్స్ సర్టిఫికెట్ల విలువ ఈ సారి పెరిగింది. సతీమణి జశోదాబెన్ పేరిట ఉన్న ఆస్తుల గురించి తెలియదని మోదీ తెలియజేశారు.
పూర్తి వివరాలివే…
మోదీ చేతిలో ప్రస్తుతం రూ.30,240 నగదు మాత్రమే ఉంది. గాంధీనగర్ SBIలో బ్యాలెన్స్ రూ.574.. అదే బ్యాంకులో FDR, MOD పేరిట రూ.2,47,44,335(2 కోట్ల 47 లక్షల 44 వేల 335), పోస్టల్ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లు రూ.9,19,635(9 లక్షల 19 వేల 635), నాలుగు బంగారు ఉంగరాల విలువ రూ.2,01,660 ఉన్నట్లు ఆయన సమర్పించిన వివరాల ద్వారా వెల్లడైంది.