గోవా వెళ్లాలంటే ఇప్పటిదాకా సికింద్రాబాద్ నుంచి బయల్దేరే రైలుకు గుంతకల్ వద్ద.. తిరుపతి-గోవా ట్రెయిన్ కు 10 కోచ్ లు కలిపేవారు. కాచిగూడ-యెలహంక మధ్య వారానికి 4 రోజులు జర్నీ చేసే రైలుకు 4 గోవా కోచ్ ల్ని కలిపేవారు. ఇలా అతుకుల బొంత వ్యవహారంతో ఎప్పుడూ ఫుల్ రష్ ఉండేవి గోవా ట్రెయిన్స్. కానీ ఈ కష్టాలకు చెల్లుచీటి ఇచ్చేలా ఇక నుంచి సికింద్రాబాద్ ద్వారా వారానికి రెండు డైరెక్ట్ రైళ్ల(Direct Trains)ను ప్రవేశపెట్టబోతున్నది కేంద్రం.
బై వీక్లీ…
సికింద్రాబాద్-వాస్కోడగామా(గోవా)కు బై వీక్లీ రైళ్లు ప్రవేశపెడుతున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఇవి బుధ, శుక్రవారాల్లో సికింద్రాబాద్ నుంచి.. గురు, శనివారాల్లో వాస్కోడగామా నుంచి స్టార్ట్ అవుతాయి. కొత్త రైళ్లు కావాలంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ మార్చి 16న రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు లెటర్ రాశారు. ఎలక్షన్ కోడ్ వల్ల నిలిచిపోయిన ప్రక్రియ ఇప్పుడు పూర్తయింది.
రూట్ ఇదే…
(17039/17040) ట్రెయిన్ సికింద్రాబాద్, కాచిగూడ, షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, గద్వాల, కర్నూల్ సిటీ, డోన్, గుంతకల్, బళ్లారి, హోస్పేట, కొప్పల్, గడగ్, హుబ్బళ్లి, ధార్వాడ్, లోండా, క్యాసిల్ రాక్, కులెం, సాన్వోర్డెమ్, మడగావ్ జంక్షన్లలో ఆగుతూ వాస్కోడగామా చేరుకుంటుంది. ఇలా వారానికి రెండు రైళ్లతో.. ఇక గోవాకు వెళ్లే ఇబ్బందులు తీరనున్నాయి.