
టమాట ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో దాని సెగ రెస్టారెంట్లు, హోటళ్లకు తాగుతోంది. పిజ్జాలు, బర్గర్లు టమాట లేకుండానే తయారవుతున్నాయి. టమాట లేకుండానే బర్గర్లు అందిస్తున్నట్లు మెక్ డొనాల్డ్స్ ప్రకటించింది. ప్రకటించడమే కాదు… ఏకంగా బోర్డు కూడా తగిలించింది. టమాట రేట్స్ తో సామాన్యులే కాదు… సంపన్న హోటళ్లు కూడా విలవిల్లాడుతున్నాయి. దిల్లీలోని మెక్ డొనాల్డ్స్ స్టోర్ ముందు అంటించిన నోటీస్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

అయితే ఆ నోటీస్ పై నెటిజన్ల నుంచి కామెంట్లు వచ్చాయి. రేట్స్ హైక్ వల్లే టమాటలు వాడటం లేదంటూ కామెంట్లు షేర్ చేశారు. దీనిపై స్పందించిన మెక్ డొనాల్డ్స్ రిప్రజంటేటివ్… ‘టమాట ఆపడానికి ధరలు కారణం కాదు.. మాకు క్వాలిటీ సరకు దొరక్కపోవడం వల్లే ఇలా చేయాల్సి వస్తోంది’ అంటూ బదులిచ్చారు. దక్షిణాదిలో కిలో టమాట ధర రూ.150 నుంచి రూ.175 దాకా పలుకుతోంది. అదే ఉత్తరాదిలో రేట్లు రూ.250 దాటిపోతున్నాయి. గంగోత్రి ధామ్ లో ధర రూ.250 పలికింది. దేశంలోనే ఇది హయ్యెస్ట్ రేట్ గా మార్కెట్ వర్గాలు అంటున్నారు.