Okaya Electric Scooter : కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? తక్కువ ధరలో సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అందుబాటులో ఉంది. అద్భుతమైన ఫీచర్లు కలిగిన ఇ-స్కూటర్ కొనుగోలుపై ఈఎంఐ(EMI) ఆప్షన్లు కూడా ఉన్నాయి. అసలు ఈ ఆఫర్ ఏంటో తెలుసా? ఎంత డిస్కౌంట్ పొందవచ్చు. నెలకు ఎంతవరకు ఈఎంఐ కట్టాల్సి ఉంటుందో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.
లిమిటెడ్ ఆఫర్ మాత్రమే.. రూ. 10వేలు తగ్గింపు :
ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో (Okaya) ఎలక్ట్రిక్ స్కూటర్‌పై భారీ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ఇందులో ఫ్రీడమ్ ఎల్ఐ 2 (Freedum Li-2) మోడల్ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై తగ్గింపు అందిస్తోంది. బల్క్ పేమెంట్ చేయలేకపోతే కొద్దిగా డౌన్ పేమెంట్ కట్టేసి ఆపై మిగిలిన మొత్తంపై ఈఎంఐ ఆప్షన్ పెట్టుకోవచ్చు. ప్రస్తుతానికి భారత మార్కెట్లో Okaya ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.75,899కు అందుబాటులో ఉండగా.. రూ.10వేలు తగ్గింపు ధరతో కేవలం రూ.65,899కు కొనుగోలు చేయొచ్చు. లిమిటెడ్ ఆఫర్ మాత్రమే.. మళ్లీ ధర పెరిగే లోపు కొనేసుకోవడం మంచిది.
గరిష్ఠ వేగం గంటకు 25 కి.మీ :
ఇ- స్కూటర్ సింగిల్ చార్జ్ చేస్తే చాలు.. ఏకంగా 75 కిలోమీటర్ల వరకు దూసుకుపోతుంది. గంటకు 25 కిలోమీటర్లు టాప్ స్పీడ్ అందిస్తుంది. మొత్తంగా ఛార్జింగ్ టైమ్ 5 గంటలు వస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు ట్యూబ్‌లెస్ టైర్లు ఉన్నాయి. అంతేకాదు.. స్పీడో మీటర్, బ్యాటరీ ఇండికేటర్, ట్రిప్ మీటర్, ట్యాకో మీటర్ వంటి ఫీచర్లు కూడా అదనంగా ఉన్నాయి. ప్రత్యేకించి ఎల్ఈడీ హెడ్‌లైట్స్ ఆకర్షణీయంగా ఉంటాయి. టెలీస్కోపిక్ సస్పెన్షన్ కూడా అందించారు. రిమోట్ స్టార్ట్ అండ్ స్టాప్ ఫీచర్ కూడా ఉంది.
నో కాస్ట్ ఈఎంఐ, నెలకు ఎంత పడుతుందంటే? :
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులు ఎవరైనా సరే నో కాస్ట్ (No-Cost EMI) ఈఎంఐ ఆప్షన్ కూడా ఎంచుకోవచ్చు. అదే మూడు నెలలకు పెట్టుకుంటే నెలకు రూ.25,300 చెల్లించాల్సి ఉంటుంది. అదే ఆరు నెలలకు గాను నెలవారీగా చెల్లించాల్సిన మొత్తం రూ.12,650 వరకు పడుతుంది. 9 నెలల వరకు పెట్టుకుంటే.. నెలవారీ ఈఎంఐ చెల్లింపు రూ.8434 చెల్లించాల్సి రావచ్చు. చివరిగా 12 నెలల వరకు ఉండాలనుకుంటే మాత్రం నెలకు రూ.6325 వరకు కట్టాల్సి వస్తుంది.
ఒకవేళ మీరు రూ.35 వేల వరకు డౌన్ పేమెంట్ కట్టినట్టు అయితే.. చెల్లించాల్సిన ఈఎంఐ మొత్తం చాలావరకు తగ్గుతుంది. అంటే.. నెలకు సుమారుగా రూ.1708 వరకు ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉండటంతో అదనంగా వడ్డీ భారం పడదు. ఇంకెందుకు ఆలస్యం.. ఆఫర్ ముగిసేలోగా ఇప్పుడే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కొని ఇంటికి తెచ్చేసుకోండి.
Published 07 Feb 2024