ఓయో(OYO) రూమ్స్ అంటేనే జుగుప్సాకరంగా తయారైన పరిస్థితులు చూస్తున్నాం. భారతీయ సంప్రదాయాల్ని(Traditions) మంటగలుపుతున్నారంటూ గత కొన్నేళ్లుగా ఓయోపై తీవ్ర విమర్శలున్నాయి. ఇష్టమొచ్చినట్లుగా జంటలకు గదులు కేటాయించి విచ్చలవిడితనానికి కారణమవుతుందని భావిస్తుండగా.. ఆ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి పెళ్లి కాని జంటలకు ఎట్టి పరిస్థితుల్లోనూ రూమ్స్ ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు చెక్ ఇన్ పాలసీలో కీలక మార్పులు తీసుకొచ్చింది. వివాహం కాని యువతీ, యువకులు ఓయో గదుల్లో చెక్ ఇన్ చేసే ముందు వారి రిలేషన్ షిప్ నకు సంబంధించిన ID ప్రూఫ్స్ అడగనుంది.
సరైన ఆధారాలు లేకపోతే బుకింగ్స్ ను తిరస్కరించే అధికారాన్ని భాగస్వామ్య(Partner) హోటల్స్ కు ఇస్తున్నట్లు ఓయో ప్రకటించింది. ఈ నూతన చెక్ ఇన్ పాలసీ విధానాన్ని తొలిసారిగా మీరట్ లోని హోటల్స్ లో ప్రారంభించింది. వాటిని పరిశీలించిన తర్వాత ఈ కొత్త రూల్ ని దేశవ్యాప్తంగా అమలు చేయాలన్న ఆలోచనలో ఓయో ఉంది. వివిధ వర్గాల నుంచి వచ్చిన వినతుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.