పన్ను చెల్లింపుదారుల(Tax Payers) సేవల్ని మరింత ఆధునికరించేందుకు ‘పాన్ కార్డ్ 2.0’ ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. డిజిటల్ ఇండియా విజన్లో భాగంగా QR కోడ్ తో పాన్ కార్డును ఉచితంగా అప్ గ్రేడ్ చేసేలా రూ.1,435 కోట్ల వ్యయంతో ఈ విధానాన్ని అమలు చేయబోతున్నారు. మెరుగైన క్వాలిటీతో సులభంగా యాక్సెస్ చేస్తూనే స్పీడ్ గా సర్వీస్ డెలివరీ అయ్యేలా ‘పాన్ 2.0’ ఉండనుందని కేంద్రం తెలిపింది.
‘పాన్ 2.0 అంటే…’
డిజిటల్ సర్వీసులు, సాంకేతికత(Technology) ద్వారా వ్యాపార ప్రక్రియల్ని సులభతరం చేయడమన్నమాట. PAN/TAN సేవల్ని ఇ-గవర్నెన్స్ ద్వారా కోర్-నాన్ కోర్ సేవల్ని కలుపుతూ డిజిటలైజ్ చేయడం ముఖ్య ఉద్దేశం. తద్వారా పన్ను ఎగవేతల్ని గుర్తించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఆదాయపన్ను శాఖ ద్వారా లామినేటెడ్ అయ్యే కార్డు ఏ దరఖాస్తుదారుడికైనా ఎలాంటి అభ్యర్థన(Request) లేకుండా అందించనుంది. TDS/TCS క్రెడిట్లు, టాక్స్ రిటర్న్స్, ఒక వ్యక్తికి ఇన్ కం టాక్స్ కు లింక్ చేయడం వంటివన్నీ ఈజీగా సాగడంతోపాటు మొత్తంగా QR కోడ్, పేపర్ లెస్, ఆన్లైన్ పద్ధతిలో ‘పాన్ 2.0’ ఉంటుంది.