స్వాతంత్ర్య దినోత్సవాన భారత దేశం మరో ఘనతను చేరుకుంది. అమెరికా డాలర్లు(US Dollars)కు బదులు భారతీయ కరెన్సీ అయిన రూపాయిల్లోనే చెల్లింపులు జరపడం సరికొత్త విశేషంగా నిలుస్తున్నది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మొట్టమొదటిసారిగా మన దేశ కరెన్సీ చెల్లింపుల్ని దిగ్విజయంగా భారత్ పూర్తి చేసింది. ముడిచమురు దిగుమతులకు సంబంధించి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ UAEకి చెల్లింపులు(Transactions) చేసింది. US డాలర్లను ఉపయోగించే సంప్రదాయం నుంచి ఇండియా బయటపడటం సరికొత్త మైలురాయిగా ఆర్థిక నిపుణులు అభివర్ణిస్తున్నారు. UAEతో ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడానికి, ద్వైపాక్షిక బంధాల్లో సరికొత్త ఒరవడిని సృష్టించేందుకు ఈ విధానం మన దేశానికే హైలెట్ అంటున్నారు.
ఇంధన రంగంలో వ్యూహాత్మక భాగస్వామ్యాలను పెంచడానికి, కరెన్సీలో ఆల్టర్నేటివ్ మార్గాలకు ఈ కొత్త విధానం ఉపయోగపడుతుందని ఆర్థిక శాఖ అంటోంది. US డాలర్ల నుంచి భారతీయ రూపాయిల్లోకి చెల్లింపులు మారడం కరెన్సీ దుర్వినియోగం లాంటి ప్రమాదాల్ని అడ్డుకోవడంతోపాటు సులభతర(Easyest) వాణిజ్య పరిష్కారాలను వేగవంతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.