ఇండియాలో మాన్యుఫాక్చరింగ్(Manufacturing) చేపట్టే సెమీ కండకర్ల కంపెనీలకు 50 శాతం సబ్సిడీ ఇస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. సెమీకాన్ ఇండియా 2023 ప్రోగ్రాంలో ఆయన ప్రకటించారు. భారత చిప్ రంగంలో పెట్టుబడులకు ఎంతో ఎంకరేజ్ చేస్తున్నామని, ఎందుకు ఇన్వెస్ట్ చేయాలనే స్థాయి నుంచి ఇక్కడే పెట్టుబడి పెట్టాలనే సిస్టమ్ కు తీసుకువచ్చామన్నారు. ఇపుడు భారతీయుల ఆకాంక్షల కారణంగా ఫోర్త్ రెవల్యూషన్ రానుందని భావిస్తున్నట్లు ప్రధాని అన్నారు. సెమీ కండ క్టర్ రంగంలో భారత్ అపార పురోగతి(Huge Development) సాధించిందని, 300 కాలేజీల్లో సెమీ కండక్టర్ డిజైన్ కోర్సులు నడుస్తున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం 10 బిలియన్ డాలర్ల(రూ.82,000 కోట్లు) ఎంకరేజ్ మెంట్ స్కీమ్ తీసుకురావడాన్ని గుర్తు చేశారు.
దేశీయ తయారీ చిప్ కంపెనీ రెండేళ్లలో స్టార్ట్ అవుతుందని, తొలి దశలో 5 బిలియన్ డాలర్లు(రూ.41,000 కోట్లు) ఇన్వెస్ట్ చేస్తామని వేదాంత గ్రూప్ ప్రకటించింది. సెమీకాన్ ఇండియా 2023 సదస్సులో పాల్గొన్న ఆ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అగర్వాల్… తొలి సెమీ కండక్టర్, డిస్ ప్లే ఫ్యాబ్ ప్లాంట్ ను గుజరాత్ లోని ఢోలెరా స్పెషల్ ఇన్వెస్ట్ మెంట్ రీజియన్ లో నిర్మిస్తామన్నారు. భారత్ లో ఫస్ట్ చిప్ ఫ్యాక్టరీని గుజరాత్ లో రూ.22,540 కోట్లతో ఏర్పాటు చేస్తామని తద్వారా 20,000 ఎంప్లాయ్ మెంట్ కల్పిస్తామని US కంపెనీ మైక్రాన్ టెక్నాలజీ తెలియజేసింది.