విచ్చలవిడిగా పెరిగిపోతున్న కాలుష్యంపై ఉక్కుపాదం మోపాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా.. మంత్రి నితిన్ గడ్కరీ మరో కీలక ప్రతిపాదన చేశారు. ఇక నుంచి డీజిల్ వెహికిల్స్ పై 10 శాతం పొల్యూషన్ టాక్స్ విధించాలన్న ఆలోచనతో ఉన్నట్లు తెలిపారు. డీజిల్ తో నడిచే వాహనాల సేల్స్ ను తగ్గించేందుకు గాను అదనంగా మరో 10 శాతం GSTని విధించాలన్న ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. సియామ్ కు చెందిన యాన్యువల్ సమ్మిట్(Annual Summit)లో పాల్గొన్న ఆయన.. ఇందుకు సంబంధించి ప్రపోజల్స్ పై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాయనున్నట్లు స్పష్టం చేశారు.
ఈ పరిణామంతో డీజిల్ వాహనాల రేట్స్ బాగా పెరిగే అవకాశముంది. దీని ప్రభావం ఎక్కువగా కార్లపై పడుతుందని బిజినెస్ ఎక్స్ పర్ట్స్ అంటున్నారు.