టాక్స్ సేవింగ్స్, ఆర్థిక భద్రత, సురక్షిత పెట్టుబడుల(Investments)కు పోస్టాఫీసులు అక్కరకొస్తాయి. ఎలాంటి రిస్కులు ఉండని కారణంగా పోస్టాఫీస్ పథకాల్లో డబ్బులు పెడుతుంటే వాటిపై ఎప్పటికప్పుడు వడ్డీ రేట్లను సవరిస్తూ అందిస్తుంటారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరాని(Financial Year)కి కొత్త వడ్డీరేట్లు ప్రకటించింది.
త్రైమాసిక రివ్యూలో భాగంగా.. శ్యామలా గోపినాథ్ కమిటీ నివేదిక ప్రకారం కొత్త వడ్డీ రేట్లను ఆర్థిక శాఖ ప్రకటించింది. రిజర్వ్ బ్యాంక్ ఇండియా(RBI) 2022 మే నుంచి క్రమంగా వడ్డీ రేట్లను పెంచుతున్నది.
స్కీములు – వడ్డీ రేట్లు ఇలా…
స్కీమ్ | వడ్డీ శాతం |
సేవింగ్స్ డిపాజిట్ | 4 |
ఏడాది కాల డిపాజిట్ | 6.9 |
రెండేళ్ల కాల డిపాజిట్ | 7 |
మూడేళ్ల కాల డిపాజిట్ | 7.1 |
ఐదేళ్ల కాల డిపాజిట్ | 7.5 |
ఐదేళ్ల కాల రికరింగ్ డిపాజిట్ | 6.7 |
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ | 8.2 |
మంత్లీ ఇన్ కమ్ అకౌంట్ స్కీమ్ | 7.4 |
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ | 7.7 |
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ | 7.1 |
కిసాన్ వికాస్ పత్ర | 7.5 (115 నెలల్లో మెచ్యూరిటీ) |
సుకన్య సమృద్ధి యోజన | 8.2 |