దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Market) సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఈరోజు పొద్దున సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా లాభంతో 66,808 మధ్య కొనసాగుతుండగా.. నిఫ్టీ 72 పాయింట్లు లాభపడి 19,892 వద్ద ట్రేడవుతున్నది. సెన్సెక్స్-30 ఇండెక్స్ లో టాటా మోటార్స్, NTPC, విప్రో, HCL టెక్, సన్ ఫార్మా, రిలయన్స్, SBI, HDFC బ్యాంక్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇన్ఫోసిస్, ఇండస్ ఇండ్ బ్యాంక్, HUL, టాటా స్టీల్, భారతీ ఎయిర్ టెల్ షేర్లు నష్టాల్లో నడుస్తున్నాయి.
జీ20 సదస్సు విజయవంతంగా ముగియడం, వివిధ దేశాల నుంచి ఏకాభిప్రాయం కుదరడం వంటి కారణాలు స్టాక్ మార్కెట్ పై పాజిటివ్ ఫలితాలు చూపవచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో మొదలయినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.