2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీగా డివిడెండ్ కేటాయించింది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా రూ.2.69 లక్షలను ప్రకటించింది. 2023-24తో పోల్చితే 27.37% అధికంగా నిధుల్ని ఇస్తోంది. RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఆధ్వర్యంలో భేటీ అయిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్.. భారీగా డివిడెండ్ ప్రకటించారు. దేశీయ ఆర్థిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నా. ఈ నిధులతో ఆర్థిక లోటును పూడ్చుకునే అవకాశం మోదీ సర్కారుకు దొరికింది.