రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI)కి కొత్త గవర్నర్ ను నియమిస్తూ కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ నిర్ణయం తీసుకుంది. సీనియర్ IAS అధికారి సంజయ్ మల్హోత్రాను కీలక పదవికి ఎంపిక చేసింది. ప్రస్తుతం సంజయ్ రెవెన్యూ సెక్రటరీగా పనిచేస్తుండగా.. శక్తికాంతదాస్ స్థానంలో ఆయన ఎల్లుండి బాధ్యతలు చేపడతారు. రాజస్థాన్ కేడర్ కు చెందిన 1990 IAS బ్యాచ్ అధికారి సంజయ్.. RBIకి 26వ గవర్నర్. IIT కాన్పూర్లో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ చదివిన ఆయన.. అమెరికా ప్రిన్స్ టన్ యూనివర్సిటీలో పబ్లిక్ పాలసీ కోర్సులో MS పూర్తి చేశారు. పన్ను వసూళ్లలో కొత్త విధానాలతోపాటు దేశంలో GST కలెక్షన్లు భారీగా పెంచడంలో కీలక పాత్ర పోషించారు. శక్తికాంతదాస్ ఆరేళ్లపాటు పదవిలో ఉండగా, మల్హోత్రా మూడేళ్ల పాటు RBI గవర్నర్ గా కొనసాగుతారు.