బ్యాంకు ఖాతాదారుల(Account Holders)కు ఎప్పటికప్పుడు మెరుగైన సేవలు అందేలా చూసే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI).. మరో కొత్త రూల్ తీసుకొచ్చింది. దీనివల్ల ఇకనుంచి ఖాతాదారులకు సంబంధించిన నామినీల విషయంలో ఇబ్బందులు తప్పనున్నాయి. బ్యాంకులు, NBFC(నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్)ల్లో భారీసంఖ్యలో డిపాజిట్ దారులకు నామినీలు లేవని RBI గుర్తించి.. ఇక నుంచి తప్పనిసరిగా నామినీలు ఉండాలని ఆదేశాలు జారీచేసింది. డిపాజిటర్లలో ఎవరైనా మరణిస్తే ఆ డబ్బు తీసుకోవడానికి కుటుంబ సభ్యులు ఇబ్బంది పడుతున్నారు.
ఇప్పటికే ఉన్నవారు, కొత్త ఖాతాదారులు, ఫిక్స్ డ్ డిపాజిట్లు, సేవింగ్స్ అకౌంట్స్, సేఫ్టీ లాకర్లు ఉన్న వ్యక్తులు కచ్చితంగా నామినీల పేర్లను అందజేయాల్సి ఉంటుంది. నామినీల్ని ఖాతాదారులు కలిగి ఉన్నారా, లేదా అనేది ఆయా బ్యాంకులు ఎప్పటికప్పుడు సమీక్ష(Review) చేయాల్సిందేనని రిజర్వ్ బ్యాంక్ స్పష్టం చేసింది. మార్చి 31 నుంచి ప్రతి మూడు నెలలకోసారి వీటికి సంబంధించిన వివరాల్ని అందజేయాలని ఆదేశించింది.