
IT రిటర్న్ లు ఈ ఏడాది రికార్డు స్థాయిలో దాఖలయ్యాయి. జులై 31తో గడువు ముగిసిపోగా ఆ ఒక్క రోజే గతంలో ఎన్నడూ లేనంతగా రిటర్న్స్ వచ్చాయి. ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో 6.77 కోట్ల రిటర్న్స్ దాఖలయ్యాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి 16.1 శాతం ఎక్కువగా రిటర్న్ లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. గతేడాది జులై లాస్ట్ వరకు 5 కోట్ల రిటర్న్స్ రాగా.. జులై 31న ఒక్కరోజే 64.33 లక్షలు వచ్చాయి. ఇందులో 5.63 కోట్ల ITRలకు సంబంధించి ఇ-వెరిఫై కూడా పూర్తయినట్లు తెలిపారు. మరోవైపు ఇప్పటిదాకా 3.44 కోట్ల ITRల ప్రాసెసింగ్ కూడా కంప్లీట్ చేశారు.