GST శ్లాబుల మార్పుతో పేదలు, మధ్యతరగతి ప్రజలకు మేలు జరగనుంది. నిత్యావసర వస్తువుల ధరలు భారీగా దిగివస్తాయి. హెయిర్ ఆయిల్, సబ్బులు(Soap Bars), షాంపూలు, టూత్ పేస్ట్, బ్రష్ లు, టేబుల్ వేర్, కిచెన్ వేర్ వస్తువులు 18%, 12% నుంచి 5 శాతానికి దిగివస్తాయి. UHT మిల్క్, పన్నీర్, అన్ని రకాల బ్రెడ్స్ పై పన్ను ఉండదు. పదిన్నర గంటలపాటు సుదీర్ఘంగా చర్చించిన GST కౌన్సిల్.. భారీ మార్పులు చేపట్టింది.