బంగారం(Gold) ధరలతో ఇప్పటికే అల్లాడుతుంటే భవిష్యత్తులో మరింత పెరగనుందట. లీచ్ టెన్ స్టీన్(Liechtenstein) కు చెందిన ‘గోల్డ్ వుయ్ ట్రస్ట్ రిపోర్ట్-2025’ ప్రకారం.. వచ్చే ఐదేళ్లలో ధరలు మూడింతలు కానున్నాయి. మధ్యస్థంగా 4 వేల నుంచి 5 వేల డాలర్లకు, అత్యధికంగా 8,900 డాలర్లను తాకే అవకాశముందట. పుత్తడి ధర 2030 నాటికి భారీగా వృద్ధి చెందనుందని.. అయితే ఇది ద్రవ్యోల్బణం, రాజకీయ పరిస్థితులపై ఆధారపడి ఉందని తెలిపింది. స్వర్ణాన్ని దీర్ఘకాలిక పెట్టుబడిగా భావిస్తున్నారని, 2025 జనవరి-ఏప్రిల్ కాలంలో 25% పెరగడాన్ని గుర్తు చేసింది. కుటుంబాలు, ప్రపంచ మార్కెట్లు ఒక శాతం బంగారాన్ని పెట్టుబడిగా భావిస్తున్నాయట. జేపీ మోర్గాన్ సంస్థ సైతం 2029 నాటికి ఔన్సుకు 6,000 డాలర్లవుతుందని అంచనా వేసింది.