ఆమె లోక్ సభకు పోటీ చేస్తూ నామినేషన్ వేసిన అభ్యర్థి. 49 ఏళ్ల వయసు గల ఆ మహిళకు కుటుంబ ఆస్తులెంతో తెలుసా… అక్షరాలా రూ.1,400 కోట్లు. ఇక కేవలం ఆమె పేరుతోనే ఉన్న ఆస్తులు రూ.255.4 కోట్లు. ఇంతటి భారీ సంపద కలిగిన ఆమె పేరు పల్లవి డెంపో. భారతీయ జనతా పార్టీ(BJP) నుంచి సౌత్ గోవా(South Goa) నియోజకవర్గం నుంచి బరిలో నిలిచారు. నామినేషన్ వేసిన సందర్భంగా 119 పేజీల అఫిడవిట్ ను సమర్పించారు.
దంపతులకు…
పల్లవి భర్త శ్రీనివాస్.. ‘డెంపో గ్రూప్’ ఛైర్మన్. ఫుట్ బాల్ నుంచి రియల్ ఎస్టేట్ వరకు, నౌకా నిర్మాణం(Ship-Building) నుంచి గనుల తవ్వకాల(Mining) వరకు వ్యాపారాలున్నాయి. ఈ కుటుంబానికి మొత్తం రూ.1,400 కోట్ల మేర ఆస్తులుండగా, అందులో పల్లవి పేరు మీదే రూ.255.4 కోట్లు ఉన్నాయి. ఇక ఆమె భర్త శ్రీనివాస్ కు రూ.994.8 కోట్ల ఆస్తులున్నాయి. గోవా, ముంబయితోపాటు దేశంలోని వివిధ ప్రాంతాలు, విదేశాల్లోనూ భారీ అపార్ట్మెంట్లకు వీరు ఓనర్లు.
పోస్టుగ్రాడ్యుయేట్…
దుబాయ్ లోని సవన్నాలో రూ.2.5 కోట్ల అపార్ట్మెంట్, లండన్ లో రూ.10 కోట్ల విలువైన మరో భవనం ఉంది. పల్లవికి రూ.5.7 కోట్ల బంగారం ఉంటే 2022-23 ఆర్థిక సంవత్సరానికి(Financial Year)కు గాను రూ.10 కోట్ల ఆదాయ పన్ను(Income Tax) పే చేశారు. శ్రీనివాస్ సైతం అదే ఏడాది రూ.11 కోట్ల పన్ను చెల్లించారు. MIT పుణె నుంచి బిజినెస్ మేనేజ్మెంట్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ పట్టా అందుకున్నారు పల్లవి డెంపో.