సమస్యల పరిష్కారం కోసం RTC యూనియన్లు.. మళ్లీ ఉద్యమం దిశగా బాట పడుతున్నాయి. యూనియన్లు రద్దు చేస్తే సమస్యల్ని రెండేళ్లలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చి నాలుగేళ్లు గడిచినా పరిస్థితిలో ఎలాంటి మార్పూ లేదన్న కారణంతో.. మరోసారి అంతా ఏకమవ్వాలని నిర్ణయించాయి. తెలంగాణ ఏర్పడినప్పుడు 56,740 మంది ఉన్న ఉద్యోగుల సంఖ్య ప్రస్తుతం 43,530కి చేరుకున్నదని.. కొత్త బస్సులు కొనకుండా రిక్రూట్ మెంట్లు లేక, పనిభారం పెరిగి సిబ్బంది ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదంటూ నిరసనకు దిగబోతున్నాయి. TSRTC మెజార్టీ యూనియన్ల ఆధ్వర్యంలో సోమవారం(10 నాడు) మీట్ కావాలని నిర్ణయించాయి. యూనియన్ల ఎలక్షన్స్ వెంటనే నిర్వహించాలంటూ అంజయ్య భవన్ లోని లేబర్ కమిషనర్ ఆఫీసులో యూనియన్ల లీడర్లు వినతి పత్రం ఇవ్వనున్నారు.
TSRTC JAC గా ఏర్పడిన యూనియన్లు మొత్తం 21 డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచుతున్నాయి. ఇందులో TMU, TJMU, NMU, STMU, BWU, BMS, INTUC, TNTUC ఉన్నాయి. రెండు పక్క రాష్ట్రాలను ఆదర్శంగా తీసుకుని వెసులుబాట్లు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ మాదిరిగా RTCని ప్రభుత్వంలో విలీనం చేసి ఉద్యోగులుగా గుర్తించాలని… తమిళనాడు తరహాలో డీజిల్ కొనుగోలు పై టాక్స్ భారాన్ని స్టేట్ గవర్నమెంటే భరించాలని తీర్మానం చేశాయి.
యూనియన్ల డిమాండ్లు ఇవి…
మాస్టర్ పే స్కేల్స్ అమలు చేస్తూ పెండింగ్ లో ఉన్న 2017, 2021 PRCలు ఇవ్వాలి.
HIRE బస్సుల్ని రద్దు చేసి స్వాధీనం చేసుకుని, ఆ సిబ్బందిని రెగ్యులర్ ఉద్యోగులుగా చూడాలి.
2023 జనవరి DA ఇచ్చి మొత్తం 8 DAల ఎరియర్స్ వెంటనే చెల్లించాలి.
జీతాల నుంచి రికవరీ చేసిన నిధుల్ని వెంటనే అందజేయాలి.
CCS-రూ.1000 కోట్లు, PF-రూ.1200 కోట్లు, SBT, SRBSలకు రూ.500 కోట్లు చెల్లించాలి.
డ్రైవర్లు, కండక్టర్లపై మోపిన పనిభారాన్ని తగ్గించి 8 గంటల వర్క్ అమలు చేయాలి.
ప్రభుత్వ జీవో, లేబర్ యాక్ట్ ప్రకారం 8 గంటలు దాటిన పనికి డబుల్ వేజ్ చెల్లించాలి.
చట్ట వ్యతిరేకంగా నిలిపివేసిన యూనియన్ల ఎలక్షన్లని వెంటనే జరిపించాలి.