
కష్టకాలంలో తమను ఆదుకున్న చిరకాల మిత్రదేశం భారత్ పట్ల రష్యా(Russia) కృతజ్ఞత చాటుకుంది. అమెరికా విధించిన 50% సుంకాలకు రిలీఫ్ గా మోదీ సర్కారుకు ఆయిల్ డిస్కౌంట్ ప్రకటించింది. ముడిచమురు ధరను బ్యారెల్ కు 3 నుంచి 4 డాలర్లు తగ్గించినట్లు బ్లూంబర్గ్ కథనం తెలిపింది. సెప్టెంబరు, అక్టోబరులో లోడయ్యే చమురుకు తగ్గింపు వర్తిస్తుంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యాక 2022 నుంచి రష్యాకు భారత్ అతిపెద్ద దిగుమతిదారుగా ఉంది. చైనాలో SCO సదస్సు ముగిసిన కొన్ని గంటల్లోనే క్రెమ్లిన్ నాయకత్వం భారత్ కు చేయందించింది.