2 వేల పోస్టులతో కూడిన భారీ నోటిఫికేషన్ ను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) ప్రకటించింది. ప్రభుత్వ రంగ బ్యాంక్ నుంచి ఈ స్థాయిలో ప్రొబేషనరీ ఆఫీసర్స్(PO) పోస్టులకు నోటిఫికేషన్ వెలువడటం రికార్డు. ఈ పోస్టులన్నీ ప్రొబేషనరీ ఆఫీసర్స్ వే కావడం విశేషం. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 27 లోపు ఆన్ లైన్(Online)లో అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా కేటగిరీల వారీగా పోస్టులపై క్లారిటీ ఇచ్చింది. అన్ రిజర్వ్ డ్(UR)-810.. OBC-540.. SC-300.. EBC-200.. ST-150 పోస్టులకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
2023 ఏప్రిల్ 1 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు ఉండి గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా విద్యా సంస్థ నుంచి ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉన్నవారు PO ఉద్యోగ పరీక్షకు అర్హులు. ఫేజ్-1లో ప్రిలిమినరీ, ఫేజ్-2 మెయిన్స్ రాయాల్సి ఉండగా.. ఆ రెండింటిలో మంచి మార్కులు వస్తే ఇంటర్వ్యూకు సెలెక్ట్ అవుతారు. అందులో సెలెక్ట్ అయిన వారికి నెలకు రూ.41,960 బేసిక్ శాలరీగా చెల్లిస్తారు. ఈ నెల 7 నుంచి 27వ తేదీ లోపు ఇంట్రస్ట్ గల క్యాండిడేట్స్ అప్లయ్ చేసుకోవాలని SBI సూచించింది.