
GST వసూళ్లు జూన్ నెలలో భారీగా వసూలయ్యాయి. రూ.1,61,497 కోట్లు వచ్చినట్లు కేంద్రం తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్ లో వసూలైన రూ.1,87,035 కోట్ల తర్వాత రెండో హయ్యెస్ట్ కలెక్షన్స్ ఇదే కావడం విశేషం. ఇందులో CGST కింద రూ.31,013 కోట్లు, SGST కింద రూ.38,292 కోట్లు, IGST కింద రూ.80,292 కోట్లు, సెస్ కింద రూ.11,900 కోట్లు వసూలయ్యాయి.
GST సిస్టమ్ అమలులోకి వచ్చిన తర్వాత రూ.1.60 లక్షల కోట్లను మించిపోవడం ఇది నాలుగోసారి అని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. 2021-22లో సగటున నెలకు రూ.1.10 లక్షల కోట్లు రాగా.. 2022-23లో అది రూ.1.51 లక్షల కోట్లకు.. 2023-24లో రూ.1.69 లక్షలకు చేరుకున్నట్లు స్పష్టం చేసింది. జూన్ GST కలెక్షన్లలో తెలంగాణ 20 శాతం, ఆంధ్రప్రదేశ్ 16 శాతం వృద్ధిని సాధించినట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది.