భారత్ తోపాటు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తం(World Wide)గా అందరి దృష్టిని అట్రాక్టివ్ చేస్తున్న అంశం సెమీ కండక్టర్ తయారీ. స్వదేశీ సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమను శక్తిమంతం చేయడానికి మోదీ సర్కారు ‘నేషనల్ మిషన్(National Mission)’ ప్రారంభించి ఏడాదిన్నర అవుతున్నది. దీని తీవ్రతపై దృష్టిపెట్టిన మోదీ సర్కారు.. భారీ ఉద్దీపనకు ముందుకొచ్చింది. ఇన్వెస్ట్మెంట్స్ కు 50 శాతం సబ్సిడీతో ఎంకరేజ్ మెంట్ స్కీం కింద రూ.82,000 కోట్లు(10 బిలియన్ డాలర్లు) రెడీగా ఉన్నట్లు సెమీకాన్ ఇండియా-2023లో PM ప్రకటించారు. ఇప్పుడు ఈ ఇండస్ట్రీకి గుజరాత్ లోని ఢోలెరా స్పెషల్ ఇన్వెస్ట్ మెంట్ రీజియన్ కీలకం కానుంది. తొలి దశలో వేదాంత గ్రూప్ రూ.41,000 కోట్లు, USకు చెందిన మైక్రాన్ టెక్నాలజీస్ రూ.22,540 కోట్లు ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకు వచ్చాయి. ఇలా ఫస్ట్ ఫేజ్ లోనే రూ.63,540 కోట్లు రావడం స్వదేశీ సెమీ కండక్టర్ వ్యవస్థకు ఊతమిస్తుందనడంలో సందేహం లేదు.
చిన్న స్మార్ట్ ఫోన్ల నుంచి ఇంటర్నెట్ ను కంట్రోల్ చేసే మెగా డేటా సెంటర్ల వరకు ఆధునిక, డిజిటల్ లైఫ్ ల్లో సెమీకండక్టర్లదే కీలక పాత్ర. అందుకే వీటి తయారీకి సంబంధించి ఇప్పటికే క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీ(iCET)పై అమెరికాతో భారత్ ఒప్పందం చేసుకుంది. గత వారం జపాన్ తోనూ ఇదే తరహా ఒప్పందంపై సంతకం చేసింది. మొత్తంగా గుజరాత్ తోపాటు మూడు రాష్ట్రాలు ఈ ఇండస్ట్రీస్ పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. ఉదారమైన సబ్సిడీలు, స్ట్రాంగెస్ట్ పాలసీతో సెమీ కండక్టర్ ఇండస్ట్రీ టేకాఫ్ అయ్యే అవకాశం ఉన్నా.. తయారీ కేంద్రంగా మారాలంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయడం కీలకమని కార్నెగీ ఇండియా నిపుణుడొకరు అంటున్నారు. ఈ టెక్నాలజీని తేవడానికి కంపెనీలు సిద్ధంగా ఉన్నాయా అనేది ఇక్కడి బిజినెస్ కల్చర్, దేశీయ మార్కెట్, ఎక్స్ పోర్ట్స్ క్యాపబిలిటీ, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ వంటి వాటిపై ఆధారపడి ఉన్నాయన్నారు. చిప్ ల వాడకంలో భారత్.. ప్రపంచంలోనే 5 శాతాన్ని కలిగి ఉంది. 2026 నాటికి ఇది 10 శాతం దాటుతుందని అంటున్నారు.
చిప్ అభివృద్ధి, డిజైన్, ప్రొడక్షన్, ATP(అసెంబ్లీ, టెస్ట్, ప్యాకేజింగ్)లో మనదేశం బలంగా ఉన్నప్పటికీ తయారీని మొదటి నుంచి ప్రారంభించాల్సి ఉంటుందని డెలాయిట్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. చిప్ డిజైన్ టాలెంట్ లో భారత్ వాటా 20 శాతం ఉండగా.. 50,000 మంది ఉద్యోగులది మెయిన్ రోల్ అని చెప్పారు. ఇంటెల్, AMD, క్వాల్ కామ్ సహా చాలా కంపెనీలకు భారత్ లో రీసెర్చ్ సెంటర్లున్నాయి. వీటివల్ల లోకల్ గా ఇంజినీరింగ్ వ్యవస్థ బాగా వృద్ధి చెందింది. అయితే మోదీ సర్కారు ఆశిస్తున్న స్థాయికి చేరుకోవాలంటే ప్రస్తుతానికి మేధ కలిగిన సిబ్బందిని పొందడం కొంచెం కష్టంగా మారొచ్చంటున్నారు. అయితే ‘చిప్స్ టు స్టార్టప్’ ద్వారా 85,000 మంది ఇంజినీర్లకు ట్రెయినింగ్ ఇవ్వడం ద్వారా ఈ లక్ష్యాన్ని సాకారం చేసుకోవచ్చు. సాఫ్ట్ వేర్ నైపుణ్యాలకు పేరుగాంచిన భారత్ లో హార్ట్ వేర్ పరిశ్రమ ఇప్పుడిప్పుడే ప్రస్థానాన్ని మొదలుపెట్టింది. సులభతరమైన వ్యవస్థ లేకపోవడంతో GDPలో తయారీ రంగం వాటా ఏళ్లకేళ్లుగా స్తబ్ధుగా ఉంటోంది. భారత్ అందిస్తున్న తాజా స్కీమ్ ప్రపంచంలోనే టాప్ పాలసీ. US, EU కోవలోకి మన స్కీమ్ వస్తోంది. గతంలో జరిగిన తప్పుడు విధానాల వల్లే సెమీ కండక్టర్ రంగంలో భారత్ ముందడుగు వేయలేదని, ఇప్పుడు దాన్ని వదిలేస్తే హార్డ్ వేర్ రంగంలోనూ ఇండియా ప్రబల శక్తి కాగలదని ప్రపంచ నిపుణులు అంటున్నారు.
Good content.
Explained very well.