గత కొద్దిరోజులుగా లాభాల్లో దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్లు(Stock Markets) ఇవాళ సరికొత్త చరిత్రకు నాంది పలికాయి. BSE సెన్సెక్స్(Sensex) 80,000 మార్కును దాటి గరిష్ఠస్థాయి లెవెల్ చేరుకుంది. నిన్నటివరకు 79,000 పాయింట్లకు పైగా కొనసాగిన సెన్సెక్స్ ఈరోజు చరిత్రలో ఎన్నడూ లేనంతగా 80 వేల పాయింట్ల జీవితకాల గరిష్ఠానికి చేరింది. నిఫ్టీ సైతం 24,292 పాయింట్లను తాకింది.
ఇవాళ ఉదయం 79,935.12 వద్ద ట్రేడింగ్ మొదలుపెట్టిన సెన్సెక్స్ 0.62% మేర ఎగబాకి 494 పాయింట్లు నమోదు చేసింది. నిఫ్టీ సైతం 0.75%తో 134 పాయింట్లు పెరిగి 24.257.60 పాయింట్లకు చేరుకుంది.
ప్రపంచ మార్కెట్లలో మాత్రం మిక్స్ డ్ ట్రెండ్ కొనసాగుతున్నది. ఆసియా మార్కెట్లలో ముడిచమురు ధరలు పెరిగాయి. క్రూడ్ ఆయిల్ ధరలు 16 సెంట్లు పెరిగి బ్యారెల్ ధర 85.60 డాలర్లకు చేరింది. డాలర్ తో రూపాయి మారక విలువ 4 పైసలు తగ్గి 83.48 వద్ద స్థిరపడింది.