బ్యాంకింగ్, మెటల్ రంగాలు రాణించడంతో స్టాక్ మార్కెట్లు(Stock Markets) జీవితకాల గరిష్ఠాల(Lifetime Highs)ను నమోదు చేసుకున్నాయి. BSE సెన్సెక్స్ 76.000 బెంచ్ మార్క్ ను తాకింది. నిఫ్టీ సైతం 23,000 మార్క్ క్రాస్ అయి జీవితకాల రికార్డును నమోదు చేసింది. సోమవారం పొద్దున ట్రేడింగ్ లాభాలతో ప్రారంభం కాగా.. దేశీయ స్టాక్ మార్కెట్లు దూసుకుపోయాయి.
సార్వత్రిక ఎన్నికల(General Elections) ఫలితాలకు వారం రోజులే గడువు ఉన్న దృష్ట్యా స్టాక్ మార్కెట్లలో సానుకూల ఫలితాలు కనపించాయి. మధ్యాహ్నానికి 557 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్ 0.74% వృద్ధితో 75,967.38 పాయింట్ల వద్ద ట్రేడయింది. అటు నిఫ్టీ సైతం 145 పాయింట్లకు చేరి 0.63% వృద్ధితో 23,101.85 పాయింట్లను తాకింది.
అదాని పోర్ట్స్ షేర్లు 3%, దివిస్ లాబోరేటరీస్ 5% మెరుగుపడితే టాటా స్టీల్, భారతీ ఎయిర్టెల్, JSW స్టీల్, NTPC, HDFC బ్యాంక్, కోటక్ బ్యాంక్ లాభాలతో… విప్రో, మారుతి, M&M, ఏషియన్ పెయింట్స్, పవర్ గ్రిడ్ సంస్థలు నష్టాలతో కొనసాగుతున్నాయి.