కూరగాయలు, నిత్యావసరాల్లా మద్యం కూడా డోర్ డెలివరీ అయితే ఎలా ఉంటుంది.. వైన్స్ షాప్ కెళ్లి తెచ్చుకునే బదులు ఇంటికే వస్తే ఎంత బాగుంటుంది.. అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. ఇలాంటి వారి కోసమేనా అన్నట్లు కొన్ని రాష్ట్రాలు అలాగే ఆలోచిస్తున్నాయి మరి. ఆలోచించడమే కాదు పైలట్(Pilot) ప్రాజెక్టుగా హోమ్ డెలివరీ(Home Delivery) చేయాలని చూస్తున్నాయి.
ఏ రాష్ట్రాలంటే…
ఢిల్లీ, తమిళనాడు, కర్ణాటక, హర్యానా, పంజాబ్, గోవా, కేరళ.. హోమ్ డెలివరీ ఆలోచనతో ఉన్నాయి. ఆర్డర్ ఇచ్చిన వ్యక్తి వయసు(Age), ఇతర వివరాల్ని ఎంటర్ చేసేలా ఎండ్-టూ-ఎండ్ తరహాలో ట్రాన్జాక్షన్స్ జరిపే సిస్టమ్ రానుంది. స్తుతం ఒడిశా, పశ్చిమబెంగాల్లో హోం డెలివరీకి పర్మిషన్ ఉంది.
ఇది కూడా అలాగే…
మనం ఇప్పుడు వస్తువులు ఎలా ఆర్డర్ తెప్పించుకుంటున్నామో లిక్కర్ కూడా అలాగే వస్తుందన్నమాట. స్విగ్గీ, జొమాటో, బిగ్ బాస్కెట్, బ్లింకిట్ వంటి ఈ-కామర్స్ సంస్థల ద్వారా లిక్కర్ సప్లయ్ చేయబోతున్నాయన్నమాట. తొలి దశలో తక్కువ అల్కహాల్ ఉండే బీర్, వైన్, ఇతర డ్రింక్స్ సప్లయ్ చేయాలన్న ఆలోచనతో ఉన్నట్లు కంపెనీల ప్రతినిధులు అంటున్నారు.
రాబోయే పరిణామాలపై…
ఆలోచన బాగానే ఉన్నా పెద్ద నగరాల్లో హోం డెలివరీ ప్రజల్ని ప్రభావితం చేస్తుందని, అల్కహాల్ కంటెంట్ పెరిగిపోయే ప్రమాదముందన్న మాటలు వినిపిస్తున్నాయి. వైన్స్ లకు వెళ్లలేని మహిళలు, వృద్ధులు దీని బారిన పడతారన్న భావనతోనే ఆయా రాష్ట్రాల అధికారులు పూర్తిస్థాయిలో అధ్యయనం చేస్తున్నారు.