శాటిలైట్(Satellite) ఇంటర్నెట్ అందించే స్టార్ లింక్ సేవలు.. మరో 2 నెలల్లో మొదలవనున్నాయి. దేశంలో కమర్షియల్ సర్వీసుల కోసం కంపెనీ ఏర్పాట్లు చేస్తోంది. డివైజ్ కోసమే రూ.33 వేలు ఖర్చు కానుండగా, నెలవారీ ధర రూ.3 వేలు ఉండనుంది. మిగతా కంపెనీల కన్నా ఈ ధర మరీ ఎక్కువ కావడంతో స్టార్ లింక్ ను ఎంతమంది వాడతారన్నది క్వశ్చన్ మార్క్ గా మారింది. డివైజ్ కింద ఒక నెలను కాంప్లిమెంటరీ ట్రయల్ పీరియడ్ గా ఇవ్వాలన్న ఆలోచనతో కంపెనీ ఉంది. అయితే బ్రాడ్ బ్యాండ్ సేవలందని మారుమూల ప్రాంతాల్లోనూ స్టార్ లింక్ దూసుకుపోనుంది.