Published: 17 Nov 2023
కంటిన్యూగా రెండు రోజుల పాటు లాభాల బాటలో సాగిన స్టాక్ మార్కెట్లు ఈ రోజు నష్టాలతో ముగిశాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒడిదొడుకులే(Up And Downs) కనిపించాయి. పర్సనల్ లోన్ల విషయంలో నిబంధనల్ని RBI కఠినతరం(Strict) చేయడంతో ఆ సెక్టార్ లోని పలు కంపెనీల షేర్లు నష్టాల పాలయ్యాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లలోని విపరీత పరిస్థితులు సైతం దీనిపై ప్రభావం చూపాయి. సెన్సెక్స్(Sensex) 65,788.79 పాయింట్ల వద్ద మొదలై 65,794.73 వద్ద స్థిరపడింది. నిఫ్టీ(Nifty) 19,674.75 పాయింట్ల వద్ద ప్రారంభమై 19,731.80 దగ్గర ముగిసింది. మార్కెట్లు క్లోజ్ అయ్యే సమయానికి డాలర్ తో రూపాయి మారకం విలువ 83.27 వద్ద నిలిచింది.
లాభనష్టాల్లో నిలిచిన కంపెనీలివే
సన్ ఫార్మా, టాటా స్టీల్, మారుతి, నెస్లే ఇండియా, ఎం అండ్ ఎం, TCS, టాటా మోటార్స్ తోపాటు ఎల్ అండ్ టీ, HUL కంపెనీల షేర్లు లాభాల బాట పట్టాయి.
ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్, SBI, ICICI బ్యాంక్, HDFC బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, మహీంద్రా బ్యాంక్, విప్రో, రిలయన్స్ తదితల సంస్థల షేర్లు నష్టాలు మూటగట్టుకున్నాయి.
ముడి చమురు ధరలు తగ్గడంతో పెయింట్స్ కంపెనీల షేర్లు లాభపడ్డాయి.