Published 23 Jan 2024
షేర్లలో విక్రయాల ఒత్తిడి(Pressure) దేశీయ స్టాక్ మార్కెట్లు(National Stock Markets) ఈరోజు పెద్దయెత్తున నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 1,600 పాయింట్లు కోల్పోతే, నిఫ్టీ సైతం 325.70 పాయింట్ల నష్టంతో ముగించింది. సోనీ కంపెనీతో ఒప్పందం(Deal) రద్దు కావడం, జరిగిన దానికి పరిహారం చెల్లించాలంటూ జీ కంపెనీకి నోటీసులు పంపడంతో జీ కంపెనీ షేర్లు భారీగా పతనమయ్యాయి. ఇవాళ పొద్దున సెన్సెక్స్ 71,868.20 వద్ద ప్రారంభమై లాభాల్లో నడిచింది. కానీ కొద్దిసేపటికే అది నష్టాల్లోకి కూరుకుపోతూ కొనుగోళ్లకు మద్దతు లభించకపోవడంతో భారీస్థాయిలో పతనమైంది. నిఫ్టీ 325.70 పాయింట్ల నష్టంతో 21,246.10 వద్ద క్లోజ్ అయింది.
లాభ, నష్టాల్లో…
భారతీ ఎయిర్ టెల్, బజాజ్ ఫిన్ సర్వ్, ICICI వంటి షేర్లు లాభాల్లో కొనసాగితే.. SBI, హిందూస్థాన్ యునీలీవర్, HDFC బ్యాంక్, యాక్సిస్ బ్యాంకు షేర్లు నష్టాలు చవిచూశాయి. ఆసియా మార్కెట్లు బ్యాలెన్సుడ్ గా నిలిస్తే, యూరోపియన్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి.