Published 29 Jan 2024
లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్(Stock Market) సూచీలు మధ్యాహ్నానికి భారీ లాభాలు మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్(Sensex) 1,098 పాయింట్లకు పైగా లాభంలో కొనసాగుతుండగా… నిఫ్టీ(Nifty) సైతం 340 పాయింట్లకు పైగా లాభపడింది. పొద్దున్నుంచి లాభాల బాటలో కొనసాగిన సెన్సెక్స్ 1,098 పాయింట్ల లాభంతో 71,600 పాయింట్ల మార్క్ ను దాటింది. నిఫ్టీ సైతం 21,600 పాయింట్లను చేరుకుంది. గురువారం నాడు విదేశీ సంస్థాగత మదుపరులు(Foreing Institutional Investors) రూ.2,144 కోట్ల విలువైన షేర్లు అమ్మకానికి పెట్టడం, అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడాయిల్ ధరలు పెరగడం.. సెన్సెక్స్ లాభాల బాట పట్టడానికి కారణాలుగా నిలిచాయి. అటు దేశీయ సంస్థాగత మదుపరులు(DII’s) రూ.3,475 కోట్ల విలువ గల షేర్లను కొనుగోలు చేశారు.
లాభనష్టాల కంపెనీలివే…
ONGC, అదానీ ఎంటర్ ప్రైజెస్, SBI లైఫ్, HDFC బ్యాంక్, సన్ ఫార్మాస్యూటికల్స్ లాభాల్లో కొనసాగితే… సిప్లా, డా.రెడ్డీస్ లాబొరేటరీస్, బజాజ్ ఆటో, ఐటీసీ, దివిస్ లాబొరేటరీస్ మాత్రం రికార్డు స్థాయిలో నష్టాలు మూటగట్టుకున్నాయి. ఏషియన్ మార్కెట్లతోపాటు జపాన్ నిక్కీ 225, చైనాలోని షాంఘై మార్కెట్లన్నీ సోమవారం నాడు పాజిటివ్ వేవ్ లో కొనసాగాయి.