
Published 29 Jan 2024
సోమవారం పొద్దున లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్(Stock Market) సూచీలు మధ్యాహ్నానికి భారీ లాభాల బాటకు చేరుకోగా.. చివరకు పెద్దయెత్తున లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్(Sensex) 1241 పాయింట్లకు పైగా లాభపడి 71,942 పాయింట్ల వద్ద ముగిసింది. అటు నిఫ్టీ(Nifty) సైతం 385 పాయింట్ల లాభంతో 21,738 వద్ద క్లోజ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడంతో స్టాక్ మార్కెట్లు భారీ లాభాలు మూటగట్టుకున్నాయి. గురువారం నాడు విదేశీ సంస్థాగత మదుపరులు(Foreing Institutional Investors) రూ.2,144 కోట్ల విలువైన షేర్లు అమ్మకానికి పెట్టడం, అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడాయిల్ ధరలు పెరగడం.. సెన్సెక్స్ లాభాల బాట పట్టడానికి కారణాలుగా నిలిచాయి. అటు దేశీయ సంస్థాగత మదుపరులు(DII’s) రూ.3,475 కోట్ల విలువ గల షేర్లను కొనుగోలు చేశారు.
లాభ, నష్టాల కంపెనీలివే…
ONGC, అదానీ ఎంటర్ ప్రైజెస్, SBI లైఫ్, HDFC బ్యాంక్, సన్ ఫార్మాస్యూటికల్స్ లాభాల్లో కొనసాగితే… సిప్లా, డా.రెడ్డీస్ లాబొరేటరీస్, బజాజ్ ఆటో, ఐటీసీ, దివిస్ లాబొరేటరీస్ మాత్రం రికార్డు స్థాయిలో నష్టాలు మూటగట్టుకున్నాయి. ఏషియన్ మార్కెట్లతోపాటు జపాన్ నిక్కీ 225, చైనాలోని షాంఘై మార్కెట్లన్నీ సోమవారం నాడు పాజిటివ్ వేవ్ లో కొనసాగాయి.