స్టాక్ మార్కెట్లు(Stock Markets) భారీస్థాయిలో పతనమయ్యాయి. BSE సెన్సెక్స్ 1,400 పాయింట్లు పడిపోగా, NSE నిఫ్టీ 364 పాయింట్లు కోల్పోయింది. అమెరికా అధ్యక్షుడి టారిఫ్ ల ప్రకటనతో అయోమయం ఏర్పడింది. ఆ ప్రభావం ఎక్కువగా IT, బ్యాంకింగ్ రంగాలపై ఉంది. ఆటోమోటివ్ ను మినహాయిస్తే రియల్ ఎస్టేట్, ఫైనాన్షియల్, బ్యాంకింగ్, IT రంగాలు 1% నుంచి 3% మేర పడిపోయాయి. BSE లిస్టెడ్ కంపెనీలు కోల్పోయిన సంపద రూ.1.25 లక్షల కోట్ల నుంచి రూ.411.62 లక్షల కోట్లకు చేరింది. అన్ని దేశాలపై విధించే టారిఫ్ ల్ని రేపు(ఏప్రిల్ 2) ట్రంప్ ప్రకటించబోతున్నారు. దీంతో ముందస్తు భయాలు ఏర్పడి మార్కెట్లు క్రాష్ అయ్యాయి. మరిన్ని వార్తలకు https://justpostnews.com క్లిక్ చేయండి.