మరోసారి NDAదే అధికారమని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేయడంతో స్టాక్ మార్కెట్లలో జోష్ పెరిగింది. సోమవారం నాడు రికార్డు స్థాయి లాభాలతో మొదలైన ట్రేడింగ్ క్రమంగా దూసుకుపోయింది. దీంతో బాంబే స్టాక్ ఎక్చేంజ్(BSE) సెన్సెక్స్ లో మదుపరులు(Investors) భారీ స్థాయిలో రూ.11.96 లక్షల కోట్ల మేర లాభపడ్డారు. ప్రారంభ ట్రేడింగ్ లోనే 2,000 పాయింట్ల మేర లాభం నమోదు చేసిన సెన్సెక్స్.. 76,000 పాయింట్లకు దూసుకుపోయింది.
NSE నిఫ్టీ సైతం 23,000 మార్క్ కు చేరుకుంది. NDA కూటమి(Alliance) మూడోసారి అధికారంలోకి వస్తుందన్న ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో స్టాక్ మార్కెట్లు లాభాలతో హోరెత్తించాయి. ఉత్పత్తి(Manufacturing), మౌలిక సదుపాయాల(Infrastructure) రంగాలు వృద్ధి చెంది ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తుందన్న అంచనాలతో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ముందుకు వచ్చారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆయిల్, గ్యాస్, ఫైనాన్షియల్ సర్వీసెస్, మెటల్, రియాల్టీ, ఆటోమొబైల్ రంగాలు 3% నుంచి 5% లాభపడ్డాయి.