పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ(War) భయాల(Effects) దృష్ట్యా స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల(Plunges)తో మొదలయ్యాయి. సోమవారం ప్రారంభ దశలోనే BSE సెన్సెక్స్, NSE నిఫ్టీ భారీ స్థాయిలో పాయింట్లు నష్టపోయాయి. ఉదయం తొమ్మిదిన్నరకు మార్కెట్లు మొదలైతే సెన్సెక్స్(Sensex) 651 పాయింట్లు కోల్పోయి 73,594.17 వద్ద ట్రేడయింది. అటు నిఫ్టీ(Nifty) 0.96% మేర 206 పాయింట్లు తగ్గి 22,313.25 వద్ద నమోదైంది.
సెంటిమెంట్ పై…
ఆసియా మార్కెట్లు ఒడిదుడుకుల(Fluctuations)కు లోనవడంతో సెన్సెక్స్, నిఫ్టీ నష్టాలతో స్టార్ట్ చేశాయి. ఇజ్రాయెల్(Israel)పై ఇరాన్ దాడికి దిగడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ పై ప్రభావం చూపింది. ఈ ఒత్తిళ్ల ప్రభావంతో రూ.394.68 లక్షల కోట్ల BSE లిస్టెడ్ కంపెనీల్లో రూ.5 లక్షల కోట్ల మదుపర్ల(Investors) సంపద హరించుకుపోయింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు, రియాల్టీ, మీడియా రంగాలు 2%… ఆటో, ఫైనాన్షియల్, మెటల్, ఫార్మా, ఆయిల్, గ్యాస్ రంగాలు 1.2% మేర నష్టాలతో మొదలయ్యాయి.
వరల్డ్ వైడ్ గా…
ఏప్రిల్ 1న సిరియా రాజధాని డమాస్కస్ లోని ఇరాన్ ఎంబసీపై దాడి చేసి ఇద్దరు జనరల్స్ తోపాటు ఏడుగురిని ఇజ్రాయెల్ మట్టుబెట్టడం, ప్రతిగా శనివారం రాత్రి టెల్ అవీవ్ పై డ్రోన్లతో ఇరాన్ దాడి చేయడంతో ఆసియాతోపాటు ప్రపంచ మార్కెట్లు అతలాకుతలం అయ్యాయి. ఏషియన్ మార్కెట్లలో MSCI ఏషియా-పసిఫిక్ షేర్లు పతనానికి లోను కాగా జపాన్ నికీ 1%, ఆస్ట్రేలియాలోని S&P/ASX 200 ఇండెక్స్ 0.6%, హాంగ్ కాంగ్ హాంగ్ సెంగ్ ఇండెక్స్ 0.8% శాతం మేర కోల్పోయాయి.