విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థుల నుంచి రాబడి ఐదేళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. అమెరికా, కెనడా సహా వివిధ దేశాల ఆంక్షలు ఇబ్బందికరంగా తయారయ్యాయి. 2025 జూన్ లో పంపిన మొత్తం 138.8 మిలియన్ డాలర్లు(రూ.1,170 కోట్లు)గా ఉంది. గత ఐదేళ్ల సగటు 314 మి.డా.(రూ.2,700 కోట్లు) కాగా.. ఈ జూన్ లో బాగా తగ్గిపోయింది. ఇక 2021 సెప్టెంబరులో 718 మి.డా.(రూ.6 వేల కోట్లు) అత్యధికం. విద్యార్థులు పంపేదాంట్లో 10-15% తగ్గుదల ఉంటోంది.