దేశవ్యాప్తం(Countrywide)గా అన్ని ప్రధాన నగరాల్లో కాలుష్యం దారుణంగా మారుతున్న వేళ ప్రత్యామ్నాయ రవాణా మార్గంగా భావిస్తున్న ఎలక్ట్రిక్ వెహికిల్స్(EV)కు ఆదరణ కనిపిస్తున్నది. ఇప్పుడు తెలంగాణ సైతం ప్రత్యేక సబ్సిడీలు కల్పిస్తూ ఎంకరేజ్ చేస్తున్నది. ఈ కొత్త ఎలక్ట్రిక్ వెహికిల్ పాలసీ రెండేళ్ల పాటు అమల్లో ఉండటం, ఈ నెల 18నే ఇది మొదలు కావడంతో చర్చంతా EVల పైనే ఉంది. ఈ వెహికిల్ వాడకం వల్ల ఏటా లక్ష రూపాయలు మిగుల్చుకోవచ్చని రవాణా అధికారులు అంటున్నారు.
2026 డిసెంబరు 31 వరకు అమల్లో ఉండే పాలసీతో టూవీలర్, త్రీ వీలర్, రవాణా, రవాణేతర వాహనాలు, ఆటోలు, ఎలక్ట్రిక్ బస్సులకు టాక్స్ తోపాటు రిజిస్ట్రేషన్ టాక్స్ మినహాయింపు దక్కుతుంది. రూ.50,000 లోపు వాటికి 9%, రూ.50,000 దాటితే 12% టాక్స్ మినహాయింపు ఉంటుంది. రూ.5 లక్షల వెహికిల్ కు 13%, రూ.10 లక్షలుంటే 14%, రూ.20 లక్షల వాహనానికి 17%, రూ.20 లక్షలకు పైగా ఉంటే 18% టాక్స్ మినహాయింపు లభిస్తుంది. ఇక వాహనాల సంఖ్య పెరిగితే వచ్చే ఏడాది నాటికి GHMC పరిధిలో మరో 600 EV ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉంది.