ఆదాయ పన్ను మినహాయింపు గత 20 ఏళ్లల్లో(Two Decades) 12 రెట్లు పెరిగింది. 2005లో లక్ష రూపాయల మినహాయింపు ఉంటే 2025లో రూ.12 లక్షలకు చేరింది. ఈ రెండు దశాబ్దాల కాలంలో ఆరు సార్లు పన్ను మినహాయింపులు ప్రకటిస్తూ నిర్ణయాలు వెలువడ్డాయి. 2005లో లక్ష మినహాయింపు అనేది మరో ఏడేళ్ల పాటు అంటే 2012 వరకు కంటిన్యూ అయింది.
పన్ను మినహాయింపు సంవత్సరాలు…
2005 – రూ.లక్ష
2012 – రూ.2 లక్షలు
2014 – రూ.2.5 లక్షలు
2019 – రూ.5 లక్షలు
2023 – రూ.7 లక్షలు
2025 – రూ.12 లక్షలు