మధ్య(Middle), దిగువ తరగతి ప్రజలకు ఆహ్లాదాన్నిచ్చేలా భారీ ప్లాజా(T-Square)ను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. న్యూయార్క్ మనహట్టన్ లోని ప్రపంచ ప్రసిద్ధి చెందిన టైమ్ స్క్వేర్ మాదిరిగానే రాష్ట్ర రాజధానిలోనూ భారీ బిల్డింగ్ నిర్మాణానికి ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది.
ఎలా ఉంటుందంటే…
హైదరాబాద్ రాయదుర్గంలోని నాలెడ్జ్ సిటీ సమీపంలో ఈ ప్లాజా నిర్మించాలని రాష్ట్ర మౌలిక సదుపాయాల సంస్థ(TGIIC)ను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. టీ-స్క్వేర్ కోసం ఇప్పటికే ప్రణాళిక రూపొందించగా.. ఈ మేరకు టెండర్లను TGIIC ఆహ్వానించింది.
రోజువారీ పనులతో తీరిక లేకుండా గడిపే ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించేలా ఈ నూతన నిర్మాణం ఉండాలన్న సంకల్పంతో సర్కారు దీనికి రెడీ అయింది. ఇది పూర్తయితే నగరానికి ప్రధాన పర్యాటక కేంద్రంగా మారనుంది.
సెలెబ్రిటీల బర్త్ డేలు, సినిమాల అప్డేట్స్ వంటివి టైమ్ స్క్వేర్ లో ప్రదర్శిస్తుంటారు. ఇప్పుడు అదే రీతిలో తీర్చిదిద్ది సామాన్యులకు అందుబాటులో ఉండేలా టీ-స్క్వేర్ నిర్మించాలన్న తలంపుతో సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది.