మహారాష్ట్ర(Maharastra) ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్.. టెస్లా కారు నడిపారు. ముంబయి బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో కంపెనీ షోరూంను ప్రారంభించారు. భారత్ లో ఇది తొలి షోరూం కాగా.. అమ్మకాలు మొదలయ్యాయి. అమెరికన్ ఎలక్ట్రిక్ వెహికిల్(EV) మేకర్ అయిన టెస్లా.. Y మోడల్లోని ఆరు SUVలను తెచ్చింది. డార్క్ గ్రే కలర్ తో నలుపు అలాయ్ వీల్స్ కలిగిన సరికొత్త మోడళ్ల కార్లు అమ్ముతుండగా, అందులో వైర్ లెస్ ఛార్జింగ్, USB-C పోర్ట్స్, వాయిస్ కమాండ్స్, ఇంటర్నెట్ సౌకర్యం ఉంటుంది. మినిమలిస్ట్ డిజైన్ తో డ్యూయల్ టోన్ బ్లాక్&వైట్ క్యాబిన్, 15.4 అంగుళాల సెంట్రల్ టచ్ స్క్రీన్ ఉంటాయి. 4 వేల చదరపు అడుగుల కోసం నెలకు 35 లక్షల రెంట్ కడుతోందా సంస్థ. చైనా షాంఘై నుంచి దిగుమతికి 70 శాతం సుంకాలు చెల్లించాల్సి రావడంతో ఒక్కో కారు ధర రూ.59.89 లక్షలుగా ఉంది.