ఎలక్ట్రానిక్ కార్ల కంపెనీ టెస్లా(Tesla) త్వరలోనే ఇండియన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. దేశంలో కార్ల ఫ్యాక్టరీ(Factory)కి సంబంధించిన ఇన్వెస్ట్ మెంట్ పై సెంట్రల్ గవర్నమెంట్ తో చర్చలు జరిగినట్లు ప్రచారం సాగుతోంది. ఏటా ఐదు లక్షల వెహికిల్స్ తయారు చేసే కెపాసిటీ గల ప్లాంట్ కు రూపకల్పన చేయాలని చూస్తోంది. భారత్ లో ఈ ఎలక్ట్రిక్ కార్ల రేట్లు రూ.20 లక్షల వరకు ఉండొచ్చని నేషనల్ లెవెల్లో ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అటు టెస్లా(Tesla) కానీ, ఇటు కేంద్ర ప్రభుత్వం గానీ రెస్పాండ్ కాలేదు.
ప్రధాని నరేంద్ర మోదీ గత నెలలో అమెరికా(USA)లో పర్యటించిన సందర్భంగా టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తో భేటీ అయ్యారు. భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమని, త్వరలోనే అందుకు సంబంధించిన యాక్షన్ ప్లాన్ రెడీ అవుతుందని మస్క్ ప్రకటించారు. మరోవైపు భారత మార్కెట్లలోకి టెస్లా వస్తుందని ఎప్పట్నుంచో ప్రచారం నడుస్తోంది. పన్నులను తగ్గించాలని టెస్లా CEO మోదీ సర్కారును కోరారు. దీనికి ప్రభుత్వం అంగీకరించకపోగా.. అన్ని కంపెనీల మాదిరిగానే మిమ్మల్నీ చూస్తామంటూ స్పష్టం చేసింది.