భారత్ లో షోరూం మొదలైన నెల తర్వాత టెస్లా(Tesla) కారు కస్టమర్ కు చేరింది. ముంబైలో Y మోడల్ EV వచ్చేసింది. ఈ కారును మహారాష్ట్ర రవాణా మంత్రి ప్రతాప్ సర్ నాయక్ అందుకున్నారు. అది రూ.59.89 లక్షలదా లేక రూ.67.89 లక్షల రేంజా అన్న స్పష్టత లేదు. ఈ షోరూంకు 600 బుకింగ్స్ రాగా.. అంచనాలకు చాలా తక్కువని బ్లూంబర్గ్ రిపోర్ట్ తెలిపింది. ఈ ఏడాది 350 నుంచి 500 కార్లు అమ్మాలని ప్లాన్. భారత EV మార్కెట్ చిన్నది కాగా, ఏప్రిల్-జులైలో అమ్ముడైన మొత్తం కార్లలో వాటి వాటా కేవలం 5% మాత్రమే.