భారత్ లో అడుగుపెట్టాలన్న ఎలాన్ మస్క్(Musk) ఏళ్ల కల నెరవేరింది. టెస్లా(Tesla) ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు ఈనెల(జులై) 15న మొదలవుతాయి. ఇందుకోసం ముంబయి బాంద్రాకుర్లా కాంప్లెక్స్ లో తొలి షోరూం రెడీ అయింది. ఆ తర్వాత ఢిల్లీలోనూ షోరూం ఓపెన్ చేస్తారు. ‘Y’ యూనిట్స్ లోని 5 మోడళ్లు ఇప్పటికే షాంఘై ఫ్యాక్టరీ నుంచి ముంబయి వచ్చాయి. విదేశాల్లో తయారైన వాహనాలు దిగుమతి చేసుకుంటే 70% సుంకాలు చెల్లించాల్సిందే. ఈ లెక్కన ఒక్కో కారుకు రూ.40 లక్షలకు పైగా అవుతుంది. ఇక్కడే ఉత్పత్తి ప్రారంభిస్తామని ఏప్రిల్లో భారత్ వచ్చిన మస్క్ అన్నారు. అదే జరిగితే తక్కువ ధరకే కార్లు దొరుకుతాయి. https://justpostnews.com