టెస్లా(tesla), ట్విటర్(twitter) కంపెనీల అధినేత ఎలాన్ మస్క్ కు ఊహించలేని ఎదురుదెబ్బ తగిలింది. టెస్లా షేర్లు భారీస్థాయిలో పతనం కావడంతో ఒక్కరోజులోనే 20.3 బిలియన్ డాలర్లు(రూ.1,64,000 కోట్లు) కోల్పోయారు. ఎలక్ట్రిక్ వెహికిల్స్ రేట్లను తగ్గించాలని భావిస్తున్నట్లు టెస్లా ప్రకటించింది. వడ్డీ రేట్లు ఇపుడున్నట్లే కొనసాగితే ఎలక్ట్రిక్ వెహికిల్స్ రేట్లను తగ్గించక తప్పదని మస్క్ అన్నారు. దీంతో గురువారం నాడు అమెరికా స్టాక్ ఎక్ఛేంజ్ లో ఈ కంపెనీ షేర్లు అనూహ్యంగా పడిపోయాయి. షేరు ధర అమాంతంగా 9.7శాతం కుంగిపోవడంతో రూ.1,64,000 కోట్లు హాంఫట్ అయ్యాయి.
బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం మస్క్ మొత్తం సంపద 234.4 బిలియన్ డాలర్లకు తగ్గింది. అయినా ఇప్పటికీ ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్-1లోనే కొనసాగుతున్నారు.